Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 7:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 మరియు నీ దేవుడైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులనూ మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు. వారి దేవుళ్ళను పూజింపకూడదు. ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 మీరు ఎవరిని ఓడించేందుకు మీ దేవుడైన యెహోవా సహాయం చేస్తాడో, ఆ ప్రజలందరినీ మీరు నాశనం చేయాలి. వారిమీద జాలి పడవద్దు. మరియు వారి దేవుళ్లను సేవించవద్దు. ఎందుకంటే వారు మీకు ఉరియవుతారు. మీరు వారి దేవుళ్లను సేవిస్తే, మీరు శిక్ష అనుభవిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 7:16
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.


వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.


వారిని మీ దేశంలో నివసింపనివ్వకండి లేదా మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేయడానికి వారు కారణమవుతారు, ఎందుకంటే మీరు వారి దేవుళ్ళను సేవించడం ఖచ్చితంగా మీకు ఉరి అవుతుంది.”


ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’


“ ‘అయితే ఆ దేశవాసులను మీరు తరిమివేయకపోతే, అక్కడ ఉండడానికి అనుమతించిన వారు మీ కళ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలాలుగా చేసినవారవుతారు. మీరు నివసించే భూమిలో వారు మిమ్మల్ని కష్ట పెడతారు.


మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.”


మీరు వారి మాటలు అంగీకరించవద్దు, వారి మాట వినవద్దు. వారి మీద జాలి చూపవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారిని కాపాడవద్దు.


వారిని ఖచ్చితంగా చంపాల్సిందే. వారిని చంపడానికి మిగిలిన ప్రజలందరి కంటే ముందు మీ చేయి వారి మీద పడాలి.


జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.


జాలి పడకూడదు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు. ఇదే నియమం పాటించి తీరాలి.


ఆమె చేతిని తెగనరకాలి. ఆమె మీద దయ చూపకూడదు.


మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు.


మీరు వారి దేవుళ్ళ విగ్రహాలను అగ్నిలో కాల్చివేయాలి. వాటి మీది వెండి బంగారాలను ఆశించి, మీ కోసం తీసుకోకూడదు, లేకపోతే దాని వలన మీరు చిక్కులో పడతారు. మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యము.


యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు.


వారు తమను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను తిరస్కరించారు. తమ చుట్టూ ఉన్న జనాంగాల దేవుళ్ళను వెంబడించి పూజించారు. వారు యెహోవాకు కోపం రప్పించారు.


అంతేకాక నేను, ‘వారిని మీ ఎదుట నుండి తరమను; వారు మీకు ఉచ్చుగా ఉంటారు, వారి దేవుళ్ళు మీకు ఉరిగా మారుతారు’ అని చెప్పాను.”


వారు వారి కుమార్తెలను పెళ్ళి కోసం తీసుకుని తమ కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చారు, వారి దేవుళ్ళను సేవించారు.


గిద్యోను ఆ బంగారాన్ని ఏఫోదులా చేసి దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరు అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారం చేశారు. అది గిద్యోనుకు అతని కుటుంబానికి ఉచ్చుగా మారింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ