Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 33:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 అతడు–నేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదువారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, తన తల్లి గురించి అన్నవాడు అతడు. తన సోదరులను లెక్క చెయ్యలేదు. తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. నీ నిబంధన పాటించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు. ‘వారి విషయం నేను లెక్క చేయను’ అతడు తన సొంత సోదరులను స్వీకరించలేదు. తన సొంత పిల్లల్ని తెలుసుకోలేదు. లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు నీ ఒడంబడికను నిలబెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 33:9
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.


ఇది మీ దృష్టికి చాలదన్నట్టు నా దేవా, మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. దేవా యెహోవా, మీరు నన్ను మనుష్యుల్లో చాలా గొప్పవానిగా చూశారు.


కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, తమకు జ్ఞానముందని అనుకునేవారిని ఆయన లెక్కచేయరు.”


యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను.


వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.


మోషే అహరోనుతో అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో, “మీరు చావకూడదన్నా, యెహోవా ఆగ్రహం ఈ సమాజం మీదికి రావద్దన్నా మీరు మీ జుట్టు విరబోసుకోవద్దు, మీ బట్టలు చింపుకోవద్దు, అయితే యెహోవా అగ్నితో వారిని నాశనం చేసినందుకు మీ బంధువులైన ఇశ్రాయేలీయులందరు దుఃఖించవచ్చు.


అతడు శవాల దగ్గరకి వెళ్లకూడదు. అతడు తన తండ్రి శవం వలన గాని తల్లి శవం వలన గాని తనను తాను అపవిత్రంగా చేసుకోకూడదు.


“తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు.


అందుకు యేసు అతనికి, “నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?” అని చెప్పి


హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు.


“ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు.


అందువల్ల, మేము ఇప్పటినుండి లోక దృష్టితో ఎవరిని లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయము.


నేను ఇప్పుడు మనుష్యుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని ఆమోదమా? నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ప్రజలను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.


దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము.


ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండ, ఎవరి పట్ల భేదం చూపకుండ నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని ఎదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఎన్నుకోబడిన దేవదూతల ఎదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ