Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 33:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 యూదానుగూర్చి అతడిట్లనెను– యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 యూదా గురించి మోషే ఇలా పలికాడు, యెహోవా, యూదా ప్రజల మనవి విని, మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. అతని కోసం పోరాడు. అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు: “యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు. అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు. అతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 33:7
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. దావీదు అంతకంతకు బలపడుతుంటే సౌలు కుటుంబం బలహీనమవుతూ వచ్చింది.


ఇశ్రాయేలు గోత్రాలన్నీ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, “మేము నీ రక్తసంబంధులము.


అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని యెహోవాను అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.


కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.


ప్రతిరోజు దావీదుకు సహాయం చేయడానికి మనుష్యులు వస్తుండడంతో, అతని సైన్యం దేవుని సైన్యంవలె మహా సైన్యంగా మారింది.


ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.


తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి, సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి.


యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!


మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది; మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది.


కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.


ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు;


నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి, నా నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చంపబడుతుంది.


కాబట్టి ప్రభువు యువకులను చూసి సంతోషించరు తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల జాలి చూపరు. ఎందుకంటే, ప్రతి ఒక్కరు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు, ప్రతి నోరు మూర్ఖంగా మాట్లాడుతుంది. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.


“అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”


సైన్యాలకు యెహోవా చెప్పేదేమంటే, “నేను నా దూతను పంపుతాను, అతడు నా ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీరు వెదుకుతున్న ప్రభువు అంటే మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు.”


“వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;


అతడు ఇంకా ఏమి చెప్పాడంటే, ‘అయితే నేను పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడకు తెచ్చి నా ముందు వారిని సంహరించండి’ అన్నాడు.”


ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు.


మన ప్రభువు యూదా సంతానం నుండి వచ్చాడనేది స్పష్టం కాని ఆ గోత్రానికి సంబంధించి యాజకులను గురించి మోషే ఏమి చెప్పలేదు.


ఇది యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన వారసత్వం:


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ