Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 30:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 30:20
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.


అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.


యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?


ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.


ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది; మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.


యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.


ఆయన మనల్ని సజీవంగా ఉంచారు మన పాదాలు జారిపోకుండ చేశారు.


నా శాసనాలను చట్టాలను మీరు పాటించండి. ఎవరైతే వాటికి లోబడేవారు వాటి వల్లనే జీవిస్తారు. నేను యెహోవాను.


అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.


నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.


అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు.


ఆయనే వారందరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఏదో అవసరం ఉన్నట్లు మానవుల చేతులతో చేసే సేవలు ఆయనకు అవసరం లేదు.


‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.


ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి.


నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.


చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”


ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,


మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.


మీరు పాటించాలని నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రతగా పాటిస్తే అనగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి.


తద్వార వారికి వారి సంతానానికి ఇస్తానని యెహోవా మీ పూర్వికులతో వాగ్దానం చేసిన దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అధిక కాలం జీవిస్తారు.


అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు.


మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను పాటించాలని నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపిస్తున్నాను; అప్పుడు మీరు జీవిస్తారు, వృద్ధిచెందుతారు, మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.


మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు.


మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు:


అవి కేవలం మామూలు మాటలు కావు, అవి మీకు జీవము. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనపరుచుకోబోయే దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు” అన్నాడు.


ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి.


కాని మీ దేవుడైన యెహోవాను నమ్మకంగా పట్టుకుని ఉన్న మీరందరు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారు.


మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.


వాటిని జాగ్రతగా పాటించండి. ఈ శాసనాలన్నిటి గురించి వినే దేశాలకు అవే మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని తెలియజేస్తాయి; వారు, “ఈ గొప్ప దేశం ఖచ్చితంగా జ్ఞానం వివేకం కలిగిన ప్రజలు” అని చెప్పుకుంటారు.


మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై మీకు క్షేమం కలిగేలా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.


మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు.


మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.


కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి.


అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి.


ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.


అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు.


“రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ