Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 28:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గముచేతను కంకికాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యెహోవా మీపై అంటు రోగాలతో, జ్వరంతో, అగ్నితో, కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులుతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అవి మిమ్మల్ని వెంటాడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 యెహోవా రోగాలతో మిమ్ములను శిక్షిస్తాడు. మీకు జ్వరం, వాపు వస్తాయి. యెహోవా మీకు భయంకర వేడి కలిగిస్తాడు, భూమిపై వర్షాలు ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా లేక వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంతవరకు ఈ కీడులన్నీ మీకు సంభవిస్తూనే ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 28:22
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది.


“దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,


“దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,


వారు ఉపవాసం ఉన్నప్పటికీ నేను వారి మొర వినను; వారు దహనబలులను భోజనార్పణలను అర్పించినప్పటికీ నేను వాటిని అంగీకరించను. నేను వారిని ఖడ్గంతో కరువుతో తెగులుతో నాశనం చేస్తాను.”


“వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”


అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.


“ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను వడగాలి వల్ల కాటుక తెగుళ్ళ వల్ల పాడు చేశాను. మిడతలు మీ అంజూర చెట్లను ఒలీవ చెట్లను మ్రింగివేశాయి. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.


పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”


నేను నీ చేతి పనంతటిని తెగులుతో బూజుతో వడగండ్లతో నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.


గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”


యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి.


మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి.


నేను వారి మీదికి తీవ్రమైన కరువును పంపుతాను, తీవ్ర జ్వరం, మరణకరమైన తెగులు వారిని వేధిస్తాయి, నేను అడవి మృగాల కోరలను, దుమ్ములో ప్రాకే ప్రాణుల విషాన్ని నేను వారి మీదికి పంపుతాను.


మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే ఆ దేశంలో ఎక్కువకాలం నివసించకుండా వెంటనే నశిస్తారని ఈ రోజు ఆకాశాలను భూమిని మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువకాలం నివసించరు ఖచ్చితంగా నశించిపోతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ