Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 27:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 –తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుకవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 “అప్పుడు లేవీయులు, ‘ఒకడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 27:20
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు. యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు:


కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు.


కాబట్టి వారు అబ్షాలోము కోసం మేడమీద ఒక గుడారం వేశారు. ఇశ్రాయేలీయులు చూస్తుండగా అబ్షాలోము తన తండ్రి ఉంపుడుగత్తెలతో గడిపాడు.


ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.


తమ తండ్రి పడకను అవమానపరిచేవారు నీలో ఉన్నారు; బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉన్న స్త్రీలను చెరిపినవారు నీలో ఉన్నారు.


“ ‘నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకుని నీ తండ్రిని అగౌరపరచవద్దు. ఆమె నీ తల్లి; ఆమెతో లైంగిక సంబంధం ఉండకూడదు.


“ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ తండ్రిని అగౌరపరుస్తుంది.


“ ‘తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం ఉన్నవాడు తన తండ్రిని అగౌరపరిచాడు. ఆ స్త్రీ పురుషులిద్దరినీ చంపేయాలి; వారి మరణానికి వారే బాధ్యులు.


వారు నేల మట్టిని త్రొక్కినట్టు బీదల తలలను త్రొక్కుతున్నారు హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు.


మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.


ఒక పురుషుడు తన తండ్రి భార్యను పెళ్ళి చేసుకోకూడదు; అతడు తన తండ్రి పడకను అగౌరపరచకూడదు.


నలిగిన బీజములు ఉన్నవారు, పురుషాంగం కత్తిరించబడిన వారు యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ