Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 26:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 మీ దేవుడైన యెహోవా ఈ రోజున మీకాజ్ఞాపిస్తున్న ఈ శాసనాలు చట్టాలు మీరు పాటించాలి; మీ పూర్ణహృదయంతో, మీ ప్రాణమంతటితో మీరు జాగ్రత్తగా వాటిని పాటించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిననుసరించి నడుచుకొనవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 “ఈ ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ మీరు విధేయులు కావాలని నేడు మీ దేవుడైన యెహోవా మీకు ఆదేశిస్తున్నాడు. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో వాటిని జాగ్రత్తగా పాటించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 మీ దేవుడైన యెహోవా ఈ రోజున మీకాజ్ఞాపిస్తున్న ఈ శాసనాలు చట్టాలు మీరు పాటించాలి; మీ పూర్ణహృదయంతో, మీ ప్రాణమంతటితో మీరు జాగ్రత్తగా వాటిని పాటించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 26:16
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను” అని వారితో చెప్పారు.


“మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు.


ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,


మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మీకు చెప్పేవాటన్నిటిని, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాలి.


కాబట్టి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటిని పాటించండి, అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలోనికి వెళ్లడానికి బలం కలిగి ఉంటారు,


మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో మీరు నివసించినంత కాలం మీరు జాగ్రత్తగా అనుసరించవలసిన శాసనాలు చట్టాలు ఇవి.


నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు పాటించేలా చూడండి; దానికి ఏది కలపవద్దు, దానిలో నుండి ఏది తీసివేయవద్దు.


మీరు ఈ రోజు యెహోవాయే మీ దేవుడని మీరు ఆయనకు విధేయులై నడుస్తారని, మీరు ఆయన శాసనాలను, ఆజ్ఞలను, చట్టాలను పాటిస్తారని, ఆయన మార్గంలో నడుస్తారని మీరు ప్రకటించారు.


అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.


మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే.


మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన మీకు ఇచ్చిన నిబంధనలను, శాసనాలను జాగ్రత్తగా పాటించండి.


మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.


మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని మిమ్మల్ని పరీక్షించి మీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మిమ్మల్ని దీనులుగా చేయడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో ఈ నలభై సంవత్సరాలు ఎలా నడిపించారో జ్ఞాపకం చేసుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ