ద్వితీ 24:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను.వాడు బీదవాడు గనుక దానిమీద ఆశపెట్టుకొనియుండును.వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 ప్రతి రోజూ సూర్యుడు అస్తమించక ముందే అతని జీతం అతనికి ఇచ్చి వేయాలి. ఎందుకంటే, అతడు పేదవాడు, ఆ డబ్బే అతనికి ఆధారం. నీవు అతనికి అలా చెల్లించకపోతే అతడు నీ మీద యెహోవాకు ఫిర్యాదు చేస్తాడు. నీవు పాప దోషివి అవుతావు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు. အခန်းကိုကြည့်ပါ။ |
“తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.