ద్వితీ 23:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 ఎందుకంటే, మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమ్మోనీయులు, మోయాబీయులు మీకు భోజనం, నీళ్లు ఇవ్వటానికి నిరాకరించారు. మరియు మిమ్మల్ని శపించేందుకు వారు బిలాముకు డబ్బు ఇచ్చారు గనుక వారు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండజాలరు. (యరాము లోని పెతోరు పట్టణపువాడైన బెయొరు కుమారుడు బిలాము.) အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |