Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 21:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అతడు తనకున్న అన్నిటిలో రెట్టింపు వాటా ఇవ్వడం ద్వారా తాను ప్రేమించని భార్య కుమారుడిని జ్యేష్ఠ కుమారునిగా గుర్తించాలి. ఆ కుమారుడు తన తండ్రి శక్తికి మొదటి సంకేతము. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి చెందినది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 ద్వేషింపబడినదాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను అతడు స్వీకరించాలి. అతడు అన్నింటిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ అతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు ఆ బిడ్డకే చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అతడు తనకున్న అన్నిటిలో రెట్టింపు వాటా ఇవ్వడం ద్వారా తాను ప్రేమించని భార్య కుమారుడిని జ్యేష్ఠ కుమారునిగా గుర్తించాలి. ఆ కుమారుడు తన తండ్రి శక్తికి మొదటి సంకేతము. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి చెందినది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 21:17
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

“రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు


వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.”


వారి తండ్రి వారికి అనేక వెండి, బంగారం విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చాడు, వాటితో పాటు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము తనకు ప్రథమ పుత్రుడు, కాబట్టి అతనికి రాజ్యం ఇచ్చాడు.


వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు.


వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు.


అతడు తన కుమారులకు తన ఆస్తిని పంచినప్పుడు, నిజానికి జ్యేష్ఠ కుమారుడైన తాను ప్రేమించని భార్య కుమారుని స్థానంలో అతడు ప్రేమించే భార్య కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వకూడదు.


“లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: ఆమేన్ అనేవాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ