ద్వితీ 16:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవాకు మీరు ఈ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటిలో మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతిపనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీ యెహోవా దేవునికి ఏడురోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఏడు రోజులపాటు ఈ పండుగను మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు దీనిని చేయండి. మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటినీ, మీరు చేసిన పని అంతటినీ ఆశీర్వదించాడు గనుక బాగా సంతోషించండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవాకు మీరు ఈ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటిలో మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది. အခန်းကိုကြည့်ပါ။ |