Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 14:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 “ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 14:22
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు.


కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.


“అంతే కాకుండా, మా పిండిలో, భోజన అర్పణలలో, అన్ని రకాల మా పండ్లచెట్ల ఫలాల్లో, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో అన్నిటిలో ప్రథమ ఫలాన్ని మన దేవుని మందిరపు గిడ్డంగులకు యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. పదవ భాగాన్ని లేవీయుల దగ్గరకి తీసుకురావాలని, మేము పని చేసే అన్ని పట్టణాల్లో పదవ భాగాన్ని సేకరించి లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించాము.


లేవీయులు పదవ భాగాన్ని తీసుకునేటప్పుడు వారితో పాటు అహరోను వారసుడైన ఒక యాజకుడు ఉండాలని, లేవీయులు ఆ పదవ భాగాలన్నిటిలో పదవ భాగాన్ని మన దేవుని ఆలయ గిడ్డంగులకు ఖజానాకు తీసుకురావాలి.


నా మందిరంలో ఆహారం ఉండేలా పదవ భాగాన్నంతా నా ఆలయానికి తీసుకురండి. ఇలా చేసి నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలను తెరచి పట్టలేనంతగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడండి అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.


మీరు రుబ్బిన పిండితో చేసిన మొదటి రొట్టెను నూర్పిడి కళ్ళపు అర్పణగా అర్పించాలి.


“సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను.


మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము.


మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, లేదా మీ పశువుల్లో, మందలలో మొదట పుట్టిన దానిని, లేదా మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ప్రత్యేక అర్పణలు వేటిని మీ పట్టణాల్లో తినకూడదు.


అక్కడికే మీరు మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, పశువుల మందలో గొర్రెల మందలోని మొదట పుట్టిన వాటిని తీసుకురావాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ