Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 12:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 మీ దేవుడైన యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి మీకు, మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలిగేలా నేను మీకు ఇస్తున్న నిబంధనలన్నిటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్ర త్తగా వినవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

28 నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికి జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 మీ దేవుడైన యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి మీకు, మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలిగేలా నేను మీకు ఇస్తున్న నిబంధనలన్నిటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 12:28
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆవీయులు నిబ్హజును, తర్తాకును విగ్రహాలుగా చేసుకున్నారు. సెఫర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెఫర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పించారు.


“నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,


నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,


వారు ఆయన కట్టడలను అనుసరించాలని ఆయన న్యాయవిధులను పాటించాలని. యెహోవాను స్తుతించండి!


నేడు నేను మీకు ఆజ్ఞాపించే దానికి లోబడాలి. నేను అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొడతాను.


వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు.


“ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు.


“ ‘నా శాసనాలు, నా చట్టాలన్నిటిని జ్ఞాపకముంచుకొని వాటిని పాటించండి. నేను యెహోవాను.’ ”


నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు.


నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు.


నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు.


యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి దానిని తినకండి, అప్పుడు మీకు మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలుగుతుంది.


అపవిత్రం చేసే కుష్ఠు లాంటి వ్యాధి విషయాల్లో, లేవీయ యాజకులు మీకు సూచించిన విధంగా ఖచ్చితంగా చేయండి. నేను వారికి ఆజ్ఞాపించిన వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి.


మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.


మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఎక్కువకాలం జీవించేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ