Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 11:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని ఆయన ఆకాశాన్ని మూసేస్తారు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, యెహోవా మీకు ఇవ్వబోయే ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరలోనే నశించిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 లేనియెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ మీరు శీఘ్రముగా నశించెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీమీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసి వేస్తాడు. అప్పుడు వర్షం కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని ఆయన ఆకాశాన్ని మూసేస్తారు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, యెహోవా మీకు ఇవ్వబోయే ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరలోనే నశించిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 11:17
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”


“మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ, ప్రార్థిస్తే,


“మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తే,


“వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని,


ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.


నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను.


మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు.


“కోతకాలానికి మూడు నెలలు ముందు వర్షం కురవకుండా చేశాను, నేను ఒక పట్టణం మీద వర్షం కురిపించి, మరో పట్టణం మీద కురిపించలేదు. ఒక పొలం మీద వర్షం కురిసింది; వర్షం లేనిచోటు ఎండిపోయింది.


నేను వారి పూర్వికులకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువచ్చినప్పుడు, వారు తృప్తిగా తిని లావెక్కినప్పుడు, వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని సేవించి, నన్ను తిరస్కరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తారు.


మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే ఆ దేశంలో ఎక్కువకాలం నివసించకుండా వెంటనే నశిస్తారని ఈ రోజు ఆకాశాలను భూమిని మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువకాలం నివసించరు ఖచ్చితంగా నశించిపోతారు.


మీ మధ్యనున్న మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, ఆయన కోపం మీమీద రగులుకొని దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేస్తారు.


మిమ్మల్ని నాశనం చేయాలన్నంతగా కోప్పడిన యెహోవా కోపాన్ని ఉగ్రతను చూసి నేను భయపడ్డాను. కాని యెహోవా మరలా నా మనవి ఆలకించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ