Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 1:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 కాని, నీ సహాయకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో అడుగుపెడతాడు. దానిని స్వాధీనపరచుకునేలా అతడు ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు కాబట్టి అతన్ని ప్రోత్సహించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 అతడే దాన్ని ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేస్తాడు. కాబట్టి అతణ్ణి ప్రోత్సహించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

38 అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలోనికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక యెహోషువాను ప్రోత్సహించు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 కాని, నీ సహాయకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో అడుగుపెడతాడు. దానిని స్వాధీనపరచుకునేలా అతడు ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు కాబట్టి అతన్ని ప్రోత్సహించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 1:38
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

మోషే తన సహాయకుడైన యెహోషువతో కలిసి లేచి, మోషే దేవుని పర్వతం పైకి ఎక్కి వెళ్లాడు.


ఒకరు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవారు. తర్వాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు, కాని అతని సేవకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యువకుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టేవాడు కాదు.


తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.


మన దగ్గరకు వచ్చే బబులోనీయుల ముందు మీకు ప్రాతినిధ్యం వహించడానికి స్వయంగా నేనే మిస్పాలో ఉంటాను, అయితే మీరు ద్రాక్షరసాన్ని, వేసవికాలపు పండ్లను, ఒలీవ నూనెను సేకరించి, వాటిని మీ పాత్రల్లో నిల్వజేయండి, మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివసించండి” అని అన్నాడు.


ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.)


ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;


నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు.


ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు.


ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.


“మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ.


అయితే యెహోషువను నియమించి, అతన్ని ప్రోత్సాహించి బలపరచు, ఎందుకంటే అతడు ఈ ప్రజలను నది దాటిస్తాడు, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకునేలా చేస్తాడు.”


ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.


యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”


యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడు, మోషే సహాయకుడైన యెహోషువతో ఇలా అన్నారు:


యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.


తర్వాత సౌలు, “దావీదు అంటే నాకు ఇష్టం ఏర్పడింది కాబట్టి అతడు నా దగ్గర ఉండి సేవ చేయడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ