Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 9:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగాఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్పకీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యెరూషలేములో జరిగిన అరిష్టం మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి, మాకు పాలకులుగా ఉన్న మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 “దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా యెడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహా విపత్తును యెరూషలేము యెడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 9:12
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”


‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను.


ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.


భూరాజులారా సమస్త దేశ ప్రజలారా, రాకుమారులారా, పాలకులారా,


కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.


నా వలననే రాజకుమారులు ఏలుతారు, నీతిగల అధిపతులు భూమిమీద ప్రభుత్వం చేస్తారు.


కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; నేను యాకోబును నాశనానికి ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.


నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.


ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.


వారు దాని లోపలికి వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు, కానీ వారు మీకు లోబడలేదు, మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు; మీరు వారికి ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. కాబట్టి మీరు వారిపై ఈ విపత్తు అంతా తెచ్చారు.


“వెళ్లి కూషీయుడైన ఎబెద్-మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణానికి వ్యతిరేకంగా చెప్పిన నా మాటలను అనగా మేలు గురించి కాదు కాని కీడు గురించి చెప్పిన మాటలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ సమయంలో అవి మీ కళ్లముందు నెరవేరుతాయి.


ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”


“దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా? చుట్టూ తిరిగి చూడండి. యెహోవా నా మీదికి తన కోపాగ్ని దినాన తెచ్చిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?


యెరూషలేము కుమారీ! నీ గురించి ఏమి చెప్పగలను? నిన్ను దేనితో పోల్చగలను? సీయోను కుమారీ, కన్యకా! నిన్నెలా ఓదార్చడానికి నిన్ను దేనితో పోల్చగలను నీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉంది నిన్నెవరు స్వస్థపరచగలరు?


యెహోవా తాను సంకల్పించింది చేశారు, చాలా కాలం క్రితం ఆయన శాసించిన, తన మాట ఆయన నెరవేర్చారు. ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు, శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు, ఆయన నీ శత్రువుల కొమ్మును హెచ్చించారు.


సొదొమ శిక్ష కంటే నా ప్రజల శిక్ష గొప్పది, ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానే క్షణాల్లో పడగొట్టబడింది.


వారి దర్శనాలు తప్పు, వారి భవిష్యవాణి అబద్ధము. యెహోవా తమను పంపకపోయినా, “ఇదే యెహోవా వాక్కు” అని చెబుతూ తమ మాటలు నెరవేరుతాయని నమ్మిస్తారు.


మీ అసహ్యమైన విగ్రహాలన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది, ఇకపై ఎన్నడూ చేయనిది మీకు చేస్తాను.


“ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు.


అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.


“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”


అయితే నా సేవకులైన ప్రవక్తలకు నేను ఆదేశించిన మాటలు శాసనాలు మీ పూర్వికుల విషయంలో నెరవేరలేదా? “అవి నెరవేరినప్పుడు వారు పశ్చాత్తాపపడి, ‘మన ప్రవర్తనకు మన పనులకు తగినట్లుగా సైన్యాల యెహోవా తాను చేయాలనుకున్న ప్రకారం మనకు చేశారు’ అని చెప్పుకున్నారు.”


రాత్రి సమయంలో నాకు దర్శనం వచ్చింది, అక్కడ నా ఎదుట ఎర్రని గుర్రంపై ఎక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక లోయలోని గొంజిచెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, గోధుమరంగు గుర్రాలు, తెలుపు గుర్రాలు ఉన్నాయి.


తమ హృదయాలను చెకుముకి రాయిలా గట్టిగా చేసుకున్నారు, సైన్యాల యెహోవా తన ఆత్మ ద్వారా పూర్వ ప్రవక్తలకు ఇచ్చిన ఉపదేశాన్ని, మాటలను వినలేదు. కాబట్టి సైన్యాల యెహోవా చాలా కోప్పడ్డారు.


ఎందుకంటే లోకం సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు. మరి ఎప్పటికీ రాదు.


ఆకాశం భూమి గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


ఎందుకంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు, మరి ఎప్పటికీ రాదు.


ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం దండన నెరవేరే సమయం ఇదే!


పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ