Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 8:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అతడు నేను నిలుచున్న చోటికి రాగానే, నేను భయపడి సాగిలపడ్డాను. “మనుష్యకుమారుడా, అంత్యకాలం గురించిన దర్శనాన్ని గ్రహించు” అని అతడు నాతో అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు–నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అప్పుడతడు నేను నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. అతడు రాగానే నేను హడలిపోయి సాష్టాంగపడ్డాను. అతడు “నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది అని తెలుసుకో” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసుకో” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అతడు నేను నిలుచున్న చోటికి రాగానే, నేను భయపడి సాగిలపడ్డాను. “మనుష్యకుమారుడా, అంత్యకాలం గురించిన దర్శనాన్ని గ్రహించు” అని అతడు నాతో అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 8:17
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు,


వర్షం కురుస్తున్న రోజు మేఘాలలో వానవిల్లు కనిపించినట్లు, అతని చుట్టూ ఉన్న తేజస్సు కూడా అలాగే ఉంది. ఇది యెహోవా మహిమ రూపము. నేను దానిని చూసినప్పుడు, నేను నేల మీద పడిపోయాను, ఒక స్వరం నాకు వినిపించింది.


ఆయన నాతో, “మనుష్యకుమారుడా, లేచి నీ కాళ్లమీద నిలబడు. నీతో నేను మాట్లాడతాను” అన్నారు.


అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా మందిరం ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు నేను యెహోవా మహిమ ప్రకాశంతో యెహోవా మందిరం నిండిపోవడం చూసి నేను నేలపై పడ్డాను.


“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల పర్వతాల వైపు తిరిగి, వాటికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ,


అతడు, “దానియేలూ! నీవు ఎంతో విలువైనవాడవు, నేను నీతో మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలోచించి, లేచి నిలబడు, ఎందుకంటే నేను నీ దగ్గరకు పంపబడ్డాను” అన్నాడు. అతడు ఇది చెప్పిన తర్వాత, నేను వణకుతూ లేచి నిలబడ్డాను.


అప్పుడు మనిషిని పోలిన ఒక వ్యక్తి నా పెదవులు ముట్టాడు, నేను నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. నా ఎదుట నిలుచున్న వ్యక్తితో అన్నాను, “నా ప్రభువా! ఈ దర్శనాన్ని బట్టి నేను వేదన చెందాను, నేను ఎంతో బలహీనంగా అయ్యాను.


ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది.


“అంత్యకాలంలో దక్షిణాది రాజు యుద్ధంలో పాల్గొంటాడు, ఉత్తరాది రాజు రథాలు, గుర్రాల దళం, ఎన్నో యుద్ధ నౌకలతో అతని మీద దాడి చేస్తాడు. అతడు ఎన్నో దేశాలను ఆక్రమించి వరదలా వాటిని లాగేస్తాడు.


“నీవైతే, నీ మార్గాన్న అంతం వరకు వెళ్లు. నీవు విశ్రమిస్తావు, కాలాంతంలో నీవు లేచి నీకు కేటాయించబడిన స్వాస్థ్యాన్ని పొందుకుంటావు.”


అయితే దానియేలూ, నీవు ఈ గ్రంథం యొక్క మాటలను అంత్యకాలం వరకు భద్రపరచి ముద్రించు. చాలామంది జ్ఞానం అధికం చేసుకోవడానికి అటూ ఇటూ వెళ్తూ ఉంటారు.”


అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి, అతన్ని పూజించి, అతనికి నైవేద్యం ధూపం అర్పించమని ఆదేశించాడు.


అక్కడ నిలబడివున్న వారిలో ఒకని దగ్గరకు వెళ్లి, దీనంతటి అర్థం చెప్పమని అడిగాను. “కాబట్టి అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావం ఇలా తెలియజేశాడు:


దానియేలు అనే నేను ఆ దర్శనం చూసి దానిని గ్రహించుకునే ప్రయత్నం చేస్తుండగా, నా ఎదుట మనిషిలా ఉన్న ఒకడు నిలబడ్డాడు.


అతడు అన్నాడు: “ఉగ్రత కాలంలో ఏం జరగబోతుందో నీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే, దర్శనం నిర్ణీతమైన అంత్య కాలానికి సంబంధించింది.


దానియేలు అనే నేను నీరసించిపోయాను, కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నాను. తర్వాత నేను లేచి రాజు పనులలో ఉన్నాను. దర్శనాన్ని బట్టి నేను ఆందోళన చెందాను; అది గ్రహింపుకు మించింది.


నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే, ఒక మాట బయటకు వెళ్లింది, అది నేను నీతో చెప్పాలని వచ్చాను, ఎందుకంటే నీవు ఎంతో విలువగలవాడివి. కాబట్టి, వాక్కును పరిగణించి, దర్శనాన్ని గ్రహించు:


ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”


దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది; అది అంతం గురించి మాట్లాడుతుంది అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి; ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యం కాదు.


వారు లేచి చూసినప్పుడు, అక్కడ వారికి యేసు తప్ప ఇంకెవరు కనబడలేదు.


నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటివాడను చివరివాడను.


యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ