Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 7:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 సకల జనులును రాష్టములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 సకల ప్రజలు, రాష్ట్రాలు, వివిధ భాషలు మాటలాడేవారు ఆయన్ని సేవించేలా ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 “మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందునుబట్టి ప్రజలందరు, అన్ని దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 7:14
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు.


మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.


యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు. సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు. యెహోవాను స్తుతించండి.


ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం.


రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక దేశాలన్నీ ఆయనకు సేవలు చేయును గాక.


ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.


మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా:


మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.


నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; అది పూర్తిగా నాశనమవుతుంది.


ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.


ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి ముగింపు ఉండదు. ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు దావీదు సింహాసనం మీద, అతని రాజ్యాన్ని ఏలుతూ, న్యాయంతోను నీతితోను రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. సైన్యాలకు అధిపతియైన యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.


అప్పుడు ఇనుము, బంకమట్టి, ఇత్తడి, వెండి, బంగారం ముక్కలుగా విరిగిపోయి, వేసవికాలంలో నూర్పిడి కళ్ళం మీద పడే పొట్టులా అయ్యింది. జాడ తెలియలేనంతగా గాలి వాటిని ఈడ్చుకెళ్తుంది. అయితే ఆ విగ్రహాన్ని కొట్టిన ఆ రాయి మహా పర్వతంగా మారి భూమంతా నిండింది.


రాజా! మీరు రాజులకు రాజు. పరలోక దేవుడు మీకు అధికారాన్ని, శక్తిని, బలాన్ని, వైభవాన్ని అనుగ్రహించారు;


“ఆ రాజుల కాలంలో పరలోక దేవుడు ఒక రాజ్యం నెలకొల్పుతారు, అది ఎన్నటికి నశించదు, అది ఇతర ప్రజల చేతిలో పడదు. అది ఆ రాజ్యాలన్నిటినీ చితగ్గొట్టి, వాటిని తుదముట్టిస్తుంది, కాని అది మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది.


అప్పుడు దూత బిగ్గరగా ఇలా ప్రకటించాడు, “దేశాల్లారా, వివిధ భాషల ప్రజలారా, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇదే:


ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి! ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం; ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది.


“నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను. “ఆయన జీవంగల దేవుడు. ఆయన ఎల్లకాలం జీవిస్తారు; ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.


కాని, సర్వోన్నతుని పరిశుద్ధులే రాజ్యాన్ని పొందుకుంటారు, వారి రాజ్యమే యుగయుగాలకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.’


అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’


ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.


కుంటివారిని నా శేషంగా, వెళ్లగొట్టబడిన వారిని బలమైన దేశంగా చేస్తాను. యెహోవా సీయోను కొండమీద ఆ రోజు నుండి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తారు.


“నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు; అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.


యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.


“నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.”


ఆ జనసమూహం, “క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని మేము విన్నాం, మరి మనుష్యకుమారుడు మీదికి ఎత్తబడాలని నీవెలా చెప్తావు? ఈ మనుష్యకుమారుడు ఎవరు?” అని అడిగారు.


తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తం ఆయన చేతులకు అప్పగించారు.


మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం,


ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.


తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.


ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, “భూలోక రాజ్యం ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి కాబట్టి ఆయన ఎల్లకాలం పరిపాలిస్తారు.”


ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.


నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ