Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 1:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 యెహోవా యూదా రాజు యెహోయాకీముపై విజయం ఇచ్చాడు. అతడు దేవుని మందిరంలోని పవిత్ర ఉపకరణాలను అతనికి అప్పగించాడు. అతడు ఆ వస్తువులన్నిటినీ బబులోను దేశానికి తన దేవుడి ఆలయానికి తీసుకువెళ్ళి ఆ పవిత్ర ఉపకరణాలను తన దేవుడి ఖజానాలో ఉంచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ప్రభువు యూదారాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని ఆలయంనుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళడానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు ఆ వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో ఉంచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 1:2
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

షీనారులో అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు.


ప్రజలు తూర్పు వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు.


యెహోయాకీము పరిపాలన కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దేశం మీదికి వచ్చాడు, యెహోయాకీము అతనికి లొంగిపోయి, మూడేళ్ళు సామంతుడిగా ఉన్నాడు. తర్వాత అతడు నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు.


యెహోయాకీము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.


అంతేకాక యెహోవా మందిరంలో ఉన్న వస్తువులను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకెళ్లి అక్కడున్న తన దేవుని క్షేత్రంలో పెట్టాడు.


అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి తన దేవుని గుడిలో ఉంచిన యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను రాజైన కోరెషు బయటకు తెప్పించాడు.


ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? యెహోవా కాదా, మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? వారు ఆయన మార్గాలను అనుసరించలేదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.


యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.


అప్పుడు నేను యాజకులతో, ఈ ప్రజలందరితో ఇలా అన్నాను: “యెహోవా ఇలా చెప్తున్నారు: ‘అతిత్వరలో యెహోవా ఆలయ పాత్రలు బబులోను నుండి మళ్ళీ తేబడతాయి’ అని చెప్పే ప్రవక్తల మాటలను మీరు వినవద్దు, వారు మీకు అబద్ధాలు ప్రవచిస్తున్నారు.


బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను.


అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, మేము, ‘రండి, మనం బబులోను, సిరియనుల సైన్యాల నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు వెళ్దాం’ అని చెప్పుకున్నాము. కాబట్టి మేము యెరూషలేములో ఉండిపోయాం” అని చెప్పారు.


“దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’


నేను బబులోనులో బేలును శిక్షిస్తాను అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. బబులోను గోడ కూలిపోతుంది.


కాబట్టి దానియేలును రాజు సముఖానికి తీసుకువచ్చారు. రాజు దానియేలుతో ఇలా అన్నాడు, “నా తండ్రి యూదా నుండి తెచ్చిన బందీలలో ఒకడివైన దానియేలు నీవేనా?


“రాజా! సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఆధిపత్యం, మహాత్యం, ఘనత, వైభవం ప్రసాదించారు.


తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు.


అతడు జవాబిస్తూ, “దానికి ఇల్లు కట్టడానికి బబులోను దేశానికి తీసుకెళ్తున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు ఆ బుట్ట అక్కడ దాని స్థానంలో ఉంచుతారు” అన్నాడు.


తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?


యెహోవా ఇశ్రాయేలుపై కోపం వచ్చి, వారిని దోచుకునేవారి చేతికి అప్పగించారు. ఆయన వారి చుట్టూ ఉన్న శత్రువుల చేతికి వారిని అమ్మివేశారు, వారు ఆ శత్రువుల ఎదుట నిలువలేకపోయారు.


యెహోవా కోపం ఇశ్రాయేలుపై మీద రగులుకున్నందుకు ఆయన వారిని అరాము నహరయీము రాజైన కూషన్-రిషాతాయిముకు వారిని అమ్మేశారు, అతనికి వారు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉన్నారు.


కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా.


వారు దేవుని మందసాన్ని దాగోను గుడిలోనికి తీసుకువచ్చి దానిని దాగోను ప్రక్కన ఉంచారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ