Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 7:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యరొబామునకు వర్తమానము పంపి–ఇశ్రాయేలీయులమధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అప్పుడు బేతేలు యాజకుడు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యరొబాముకు ఇలా కబురు పంపాడు “ఇశ్రాయేలీయుల మధ్య, ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. అతని మాటలు దేశం సహించలేదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశం అతని మాటల్ని సహించలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 7:10
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు.


దీని తర్వాత కూడా యరొబాము తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు, కాని మరోసారి క్షేత్రాలకు అని రకాల ప్రజలను యాజకులుగా నియమించాడు. ఎవరైనా యాజకునిగా ఉండాలనుకుంటే వారిని ఆ క్షేత్రాలకు యాజకులుగా ప్రతిష్ఠించాడు.


అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.


వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.


వారు ఈ మాటలు విని భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని బారూకుతో, “ఈ మాటలన్నీ మనం తప్పక రాజుకు తెలియజేయాలి” అని అన్నారు.


అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.”


యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.


“ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.


న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.


బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”


ఎందుకంటే ఆమోసు చెప్పేది ఇదే: “ ‘యరొబాము ఖడ్గం చేత చస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశం నుండి బందీలుగా దేశాంతరం పోతారు.’ ”


యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, ఆయన బోధిస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ప్రజానాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.


వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.


“ఇతడు లోకమంతట యూదులలో కలహాలను రేపుతూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. నజరేయులు అనే మతశాఖకు ఇతడు నాయకుడు.


అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు.


న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ