Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 6:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, పరిమళ తైలాలు పూసుకుంటారు, కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 పాత్రలలో ద్రాక్షారసముపోసి పానముచేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు. మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు. యోసేపు వంశం నాశనమవుతూ ఉందని కూడా మీరు కలవరం చెందరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, పరిమళ తైలాలు పూసుకుంటారు, కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 6:6
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

“యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.


ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.


అది రాజాజ్ఞ కాబట్టి వార్తాహరులు వెంటనే బయలుదేరి వెళ్లారు. ఆ ఆజ్ఞ షూషను కోటలో అందించడం జరిగింది. రాజు, హామాను త్రాగడానికి కూర్చుకున్నారు, కాని షూషను పట్టణం ఆందోళనగా ఉంది.


ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ, వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ, ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ.


వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.


ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.


యెహోవా అతనితో, “నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు” అన్నారు.


యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు.


తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు.


సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.


మరియ సుమారు అయిదువందల గ్రాముల, అత్యంత విలువైన జటామాంసి చెట్ల నుండి తీసిన అత్తరు తెచ్చి యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లంతా పరిమళద్రవ్యపు వాసనతో నిండిపోయింది.


ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.


ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.


నీకున్న కడుపునొప్పి, నీకు తరచుగా వచ్చే బలహీనతల కారణంగా కేవలం నీటిని మాత్రమే త్రాగకుండా కొంచెం ద్రాక్షారసాన్ని కూడా త్రాగు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ