Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 3:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యెహోవా సెలవిచ్చునదేమనగా–గొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యెహోవా చెప్పేదేమిటంటే, “సింహం నోట్లో నుంచి కేవలం రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ కాపరి విడిపించేలాగా సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. కేవలం మంచం మూల, లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు. ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు. సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని, చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు. అదే మాదిరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు. సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలనుగాని, లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కనుగాని రక్షించుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 3:12
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

మిగతావారు ఆఫెకు పట్టణముకు పారిపోయారు, వారిలో ఇరవై ఏడు వేలమంది మీద ప్రాకారం కూలింది. బెన్-హదదు పట్టణానికి పారిపోయి లోపలి గదిలో చొరబడ్డాడు.


అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు. అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.


మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.


అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.


ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి.


తోటలో నుండి రాజు విందుశాలకు వచ్చాడు, ఆ సమయంలో హామాను ఎస్తేరు రాణి కూర్చున్న మంచం పైన పడి ఉండడం చూశాడు. రాజు ఆవేశంతో, “ఇంట్లో రాణి నాతో ఉండగానే వీడు రాణి మీద అత్యాచారం చేస్తాడా?” అని అన్నాడు. రాజు నోటి నుండి ఆ మాట రావడంతోనే సైనికులు హామాను ముఖానికి ముసుగు వేశారు.


“యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, నేను నా ఇంట్లోకి ప్రవేశించను, నా మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర లేదా నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”


ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు తమ దృష్టిని మరల్చుకుంటారు.


యెహోవా నాతో చెప్పే మాట ఇదే: తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా వారి కేకలకు కలవరపడకుండా సింహం ఒక కొదమసింహం తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యాల యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వస్తారు.


ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”


మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.


“నిజంగా ప్రభువైన యెహోవా కళ్లు పాపిష్ఠి రాజ్యం మీద ఉన్నాయి. నేను దాన్ని భూమి మీద ఉండకుండ నాశనం చేస్తాను. అయినా యాకోబు సంతానాన్ని సంపూర్ణంగా నాశనం చేయను,” అని యెహోవా అంటున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ