Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 8:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కోసం మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని వేడుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 అందుకు సీమోను –మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

24 ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కోసం మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని వేడుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

24 అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కొరకు మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 8:24
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అబ్రాహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అబీమెలెకును, అతని భార్య, అతని ఆడ దాసీలను స్వస్థపరచగా వారు తిరిగి పిల్లలు కన్నారు.


ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.”


అప్పుడు రాజు ఆ దైవజనునితో, “నా మీద దయచూపి నా చేయి బాగుపడేలా నా కోసం నీ దేవుడైన యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేయి” అన్నాడు. దైవజనుడు యెహోవాను వేడుకున్నప్పుడు రాజు చేయి పూర్తిగా బాగుపడి ముందులా అయ్యింది.


తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు.


కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు.


కాబట్టి మీరంతా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసుకుని, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్లి మీ కోసం దహనబలిని అర్పించాలి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను అతని ప్రార్థన అంగీకరించి మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించను” అన్నారు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు.


దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.


మీరు చెప్పినట్లే మీ పశువులను గొర్రెలను తీసుకుని వెళ్లండి. అలాగే నన్ను దీవించండి” అని చెప్పాడు.


ఫరో మోషే అహరోనులను పిలిపించి, “నా నుండి నా ప్రజల నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాకు ప్రార్థించండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి నీ ప్రజలను వెళ్లనిస్తాను” అని అన్నాడు.


అయితే రాజైన సిద్కియా, షెలెమ్యా కుమారుడైన యెహుకలును మయశేయా కుమారుడును యాజకుడునైన జెఫన్యాతో పాటు యిర్మీయా ప్రవక్తకు ఈ సందేశాన్ని పంపాడు: “దయచేసి మాకోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించండి.”


యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము.


ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు.


కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.


ప్రజలందరు సమూయేలుతో, “మేము రాజు కావాలని అడిగి మా పాపాలన్నిటి కంటే ఎక్కువ చెడు చేశాం కాబట్టి మేము చనిపోకుండా నీ సేవకులమైన మాకోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి” అన్నారు.


నాకైతే, నేను మీ కోసం ప్రార్ధన చేయడంలో విఫలమవ్వడం వలన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాడనవుతాను. అది నాకు దూరమవ్వాలి. మంచిదైన సరియైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ