Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 3:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 మీరు ప్రవక్తలకు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’ అని వాగ్దానం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో –నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీపితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 మీ పూర్వికులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’ అని అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 మీరు ప్రవక్తలకు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’ అని వాగ్దానం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

25 మీరు ప్రవక్తలకు మరియు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’ అని వాగ్దానం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 3:25
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”


అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను.


అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి.


ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.”


నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.”


నీ వారసులను ఆకాశంలోని అనేక నక్షత్రాల్లా విస్తరింపజేసి ఈ దేశాలన్నీ వారికిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు,


నీ సంతానం భూమిపై ఇసుక రేణువుల్లా అవుతారు, నీవు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తావు. భూమిపై ఉన్న సర్వ జనాంగాలు నీ ద్వార, నీ సంతానం ద్వార దీవించబడతారు.


అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.


ఆయన దానిని యాకోబుకు శాసనంగా, ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:


అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.


భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి.


ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.


మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:


“తోటి అబ్రాహాము సంతానమా దేవుని భయభక్తులు గల ఇతర జాతుల వారలారా, ఈ రక్షణ సందేశం మన కొరకే పంపబడినది.


ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.


పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”


అతడు ఈ లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అబ్రాహాము అతని సంతానం ధర్మశాస్త్రం మూలంగా పొందలేదు కాని, విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు.


అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “నీ సంతానానికి” అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు.


మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.


దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది.


ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను.


వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.


ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ