Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 26:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాల్లో కూడా వారిని వెంటాడాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 ఎన్నోసార్లు నేను ఒక సమాజమందిరమునుండి మరొక సమాజమందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాల్లో కూడా వారిని వెంటాడాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

11 అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలలో కూడా వారిని వెంటాడాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 26:11
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు; నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.


అందరికి ఒకే విధంగా జరగడం సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో చాలా చెడ్డ విషయం. అంతేకాక, మనుష్యుల హృదయాలు చెడుతో నిండి ఉన్నాయి, వారు బ్రతికి ఉన్నప్పుడు వారి హృదయాల్లో పిచ్చి ఉంటుంది, తర్వాత వారు చచ్చినవారితో కలిసిపోతారు.


మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు.


“మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. నన్ను బట్టి మీరు అధికారుల ఎదుట రాజుల ఎదుట వారికి సాక్షులుగా నిలబడతారు.


ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది.


“అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ‘నా తండ్రి దగ్గర పని చేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను.


“ఇవన్నీ జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకుని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామాన్ని బట్టి మీరు రాజుల ఎదుటకు అధికారుల ఎదుటకు కొనిపోబడతారు.


అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మండిపడి యేసును ఏమి చేయాలా అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు.


యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు.


అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరిగినప్పుడు, అతడు తన వస్త్రాలను దులుపుకొని, “ ‘మీ రక్తం మీ తలల మీదికే వచ్చు గాక!’ నేనైతే ఈ విషయంలో నిర్దోషిని. ఇక ఇప్పటినుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాను” అని వారితో చెప్పాడు.


“అందుకు నేను, ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, నిన్ను నమ్మినవారిని చెరసాలలో వేయించి హింసించానని నీకు తెలుసు.


ఈ విషయాల గురించి ప్రధాన యాజకుడు న్యాయసభ సభ్యులందరు సాక్ష్యం ఇవ్వగలరు. దమస్కులోని వారి సహచరులకు ఇవ్వవలసిన ఉత్తరాలు కూడా నేను వారి దగ్గరి నుండి తీసుకుని, శిక్షించబడడానికి వీరిని బందీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి వెళ్లాను.


మరోవైపు, సౌలు, ప్రభువు శిష్యులను చంపుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి,


మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా?


అయితే అతడు తన చెడు కార్యాన్ని బట్టి ఒక గాడిద చేత గద్దింపబడ్డాడు, ఒక మాట్లాడలేని జంతువు మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకున్నది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ