Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 24:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

26 పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 24:26
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”


భక్తిలేనివారి సహచరులు నిస్సారంగా ఉంటారు, లంచాలు ప్రేమించేవారి గుడారాలను అగ్ని కాల్చివేస్తుంది.


“లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం చూసేవారికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.


న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.


లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.


అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే.


న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు, కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు.


నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.


నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,


వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు. ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు. వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు; వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు, తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు.


దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు.


నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.


వారి పానీయాలు అయిపోయినా, వారి వ్యభిచారం కొనసాగిస్తున్నారు; వారి పాలకులు సిగ్గుమాలిన విధానాలను ఎంతో ఇష్టపడతారు.


దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! ఏ కీడు మన మీదికి రాదు” అంటారు.


వారి రెండు చేతులు కీడు చేస్తాయి; పాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. వారంతా కలిసి కుట్ర చేస్తారు.


అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు.


“నేను అనేక సంవత్సరాల తర్వాత, నా ప్రజల్లోని పేదవారికి దానధర్మం చేసి దేవునికి అర్పణలను అర్పించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చాను.


తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా,


న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.


ఈ బోధకులు దురాశతో కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు. వారికి పూర్వకాలమే ఇవ్వబడిన తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.


ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.


అయితే అతని కుమారులు అతని మార్గాన్ని అనుసరించలేదు. వారు అక్రమ సంపాదన కోసం లంచాలు తీసుకుని న్యాయాన్ని తారుమరు చేసేవారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ