Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 2:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 “ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 –అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు: ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను! మీ కుమారులు, కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు! మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది. వయస్సు మళ్ళిన మీవాళ్ళు కలలుగంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 “ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

17 “ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 2:17
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను.


దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు.


మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.


ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా, భూమిని తడిపే నీటి జల్లులా ఉండును గాక.


నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.


చివరి రోజుల్లో యెహోవా మందిరం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.


యెహోవా మహిమ వెల్లడవుతుంది. దాన్ని ప్రజలందరు చూస్తారు. యెహోవాయే ఇది తెలియజేశారు.”


నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.


నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”


“ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు.


నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను.


అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”


ఇప్పుడు నీ ప్రజలకు భవిష్యత్తులో జరుగబోయే వాటిని నీకు వివరించడానికి వచ్చాను, ఎందుకంటే దర్శనం రాబోయే కాలం గురించి వచ్చింది.”


తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.


చివరి రోజుల్లో యెహోవా ఆలయ పర్వతం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, ప్రజలు ప్రవాహంలా దాని దగ్గరకు వెళ్తారు.


“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.


సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”


దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”


నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.


ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.


యూదేతరుల మీద కూడా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడడం చూసి పేతురుతో వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు.


ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.


వారిలో అగబు అనే పేరు కలవాడు నిలబడి, రోమా సామ్రాజ్యం అంతటా గొప్ప కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అతడు చెప్పింది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది.


యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు:


ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు,


దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు.


అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు.


మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు.


ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు.


దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు.


కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.


మీ బంగారము వెండి తుప్పుపడతాయి; వాటి తుప్పు మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉండి అగ్నిలా మీ శరీరాన్ని తింటుంది. మీరు చివరిరోజుల కోసం ధనాన్ని కూడబెట్టారు.


అన్నిటికి మించి, అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు వస్తారని మీరు గ్రహించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ