Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 7:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతోకూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 “‘నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ పూర్వీకుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 7:12
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చింది: “ఈ మనుష్యుడు నీకు వారసుడు కాడు, కాని నీ రక్తమాంసాలను పంచుకుని పుట్టేవాడే నీకు వారసుడు.”


“ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని దయను చూపిస్తారు.”


అంతేకాక, నా ప్రభువైన రాజు మరణించి తన పూర్వికులను చేరిన వెంటనే, నేను నా కుమారుడైన సొలొమోను నేరస్థులుగా పరిగణించబడతాము.”


‘ఈ రోజు నా సింహాసనం మీద ఒక వారసుడు కూర్చోవడం నేను కళ్లారా చూసేలా చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక’ అన్నాడు” అని చెప్పాడు.


దావీదు మరణించే సమయం సమీపించినప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలా ఆదేశించాడు.


ఆ తర్వాత దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడి, దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.


అప్పుడు ‘నీ సంతతివారు తాము జీవించే విధానం పట్ల జాగ్రత్తగా ఉండి, నా ఎదుట తమ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మకంగా నడుచుకుంటే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే వారసుడు నీకు ఉండక మానడు’ అని యెహోవా నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు.


కాబట్టి నా తండ్రియైన దావీదుతో, ‘నీ స్థానంలో సింహాసనం మీద నీ కుమారున్ని కూర్చోబెడతాను, అతడు నా నామం కోసం దేవాలయం కడతాడు’ అని ఆయన అన్నట్లు, నేను నా దేవుడైన యెహోవా నామంలో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాను.


అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన స్వహస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:


అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.


“యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.


నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని వాగ్దానం చేసినట్లు నీ రాజ్యసింహాసనాన్ని ఎల్లకాలం ఇశ్రాయేలు మీద స్థాపిస్తాను.


అయితే, యెహోవా తన సేవకుడైన దావీదును బట్టి యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.


నీ దినాలు ముగిసి నీ పూర్వికుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తుతాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.


యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు.


ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా?


అయినప్పటికీ, యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా, దావీదు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.


సమాజమంతా దేవుని మందిరంలో రాజుతో ఒక నిబంధన చేశారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు: “దావీదు వంశస్థుల విషయంలో యెహోవా వాగ్దానం చేసినట్లుగా రాజు కుమారుడు పరిపాలన చేయాలి.


మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.


అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.


అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను, అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది.


ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.


ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి ముగింపు ఉండదు. ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు దావీదు సింహాసనం మీద, అతని రాజ్యాన్ని ఏలుతూ, న్యాయంతోను నీతితోను రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. సైన్యాలకు అధిపతియైన యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.


యెహోవా ఇలా అంటున్నారు: ‘ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చోడానికి దావీదుకు ఒకడు లేకుండా ఉండడు.


భూలోక మట్టికి చేరి నిద్రించిన వారిలో చాలామంది లేస్తారు: కొందరు నిత్యజీవం, మరికొందరు అవమానం, శాశ్వత నిందను అనుభవించడానికి.


ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:


ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు.


ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాల్లో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.


“దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత, చనిపోయాడు; అతడు అతని పితరుల వలె పాతిపెట్టబడగా అతని శరీరం కుళ్ళిపోయింది.


అతడు ఒక ప్రవక్త దేవుడు అతని సంతానంలో ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని ఒట్టు పెట్టుకుని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు.


నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము.


యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.


యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతో పాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ