Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 20:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 యోవాబుతో ఉన్న సైన్యమంత వచ్చి, ఆబేల్-బేత్-మయకాలో షేబను ముట్టడించి పట్టణ గోడలకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు సైన్యమంతా గోడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 ఈ విధంగా వారు వచ్చి ఆబేల్బేత్మయకాలో బిక్రిని ముట్టడించారు. పట్టణ ముఖ్య ద్వారం ముందు బురుజు కట్టారు. యోవాబు మనుషులు ప్రాకారాన్ని పడగొట్టి పాడు చేయడానికి పూనుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 యోవాబుతో ఉన్న సైన్యమంత వచ్చి, ఆబేల్-బేత్-మయకాలో షేబను ముట్టడించి పట్టణ గోడలకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు సైన్యమంతా గోడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 20:15
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

షేబ ఇశ్రాయేలు గోత్రాల వారందరి దగ్గరకు, ఆబేల్ బేత్ మయకా వారి దగ్గరకు బెరీయుల దగ్గరకు వెళ్లగా వారంతా కలిసికట్టుగా వచ్చి అతన్ని వెంబడించారు.


రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.


ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.


“కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.


ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు.


“కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.


“పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు.


బబులోనీయులతో జరిగిన యుద్ధంలో ముట్టడి దిబ్బల వల్ల ఖడ్గం వల్ల నాశనమైన ఈ పట్టణంలోని ఇళ్ళ గురించి, యూదా రాజభవనాల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘అవి నా కోపం ఉగ్రత వల్ల నేను చంపిన మనుష్యుల శవాలతో నిండిపోతాయి. ఈ పట్టణపు దుష్టత్వాన్ని బట్టి దానికి నేను నా ముఖాన్ని దాచుకుంటాను.


సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: “చెట్లను నరికి యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. ఈ పట్టణం శిక్షించబడాలి; ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు.


తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి.


ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కాబట్టి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ