Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 2:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 యూదా మనుష్యులు హెబ్రోనుకు వచ్చి దావీదును యూదా గోత్రానికి రాజుగా అభిషేకించారు. సౌలును యాబేషు గిలాదుకు చెందినవారు పాతిపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అప్పుడు యూదా జాతి ప్రజలు అక్కడికి వచ్చి దావీదును తమ రాజుగా పట్టాభిషేకం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 యూదా మనుష్యులు హెబ్రోనుకు వచ్చి దావీదును యూదా గోత్రానికి రాజుగా అభిషేకించారు. సౌలును యాబేషు గిలాదుకు చెందినవారు పాతిపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 2:4
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ఆ సంగతి విన్న రాజైన దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులకు ఇలా కబురు పంపించాడు: “ ‘ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటున్న విషయం రాజభవనంలో ఉన్న రాజుకు చేరింది. మరి రాజును తన భవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?


అందుకు యూదా వారు, “రాజు మీకు చాలా దగ్గరి బంధువు కాబట్టి మేమిలా చేశాము. మీకు కోపమెందుకు? మేము రాజు ఆహారంలో ఏమైనా తిన్నామా? మేము మాకోసం ఏమైనా తీసుకున్నామా?” అని ఇశ్రాయేలువారితో అన్నారు.


దావీదు హెబ్రోనులో యూదా వారిని రాజుగా పరిపాలించిన కాలం ఏడు సంవత్సరాల ఆరు నెలలు.


మీ రాజైన సౌలు చనిపోయాడు కాని యూదా ప్రజలు తమపై రాజుగా నన్ను అభిషేకించారు కాబట్టి మీరు దృఢంగా ధైర్యంగా ఉండండి” అని కబురు పంపాడు.


అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు,


దావీదు వెళ్లి యాబేషు గిలాదువారి దగ్గరి నుండి సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తీసుకువచ్చాడు. (గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను చంపి బేత్-షాను పట్టణపు వీధుల్లో వ్రేలాడదీసినప్పుడు యాబేషు గిలాదువారు వారి మృతదేహాలను దొంగిలించారు.)


ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని సురక్షిత స్థలానికి వెళ్లాడు.


ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, రాజు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు; వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.


హెబ్రోనులో యూదా వారిని ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించగా యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా వారిని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.


యెహోయాదా రాకుమారున్ని బయటకు తీసుకువచ్చి, అతని తలమీద కిరీటం పెట్టాడు; అతడు నిబంధన ప్రతిని అతనికి అందించి, అతన్ని రాజుగా ప్రకటించాడు. వారు అతన్ని అభిషేకించారు, ప్రజలు చప్పట్లు కొడుతూ, “రాజు చిరకాలం జీవించు గాక!” అని కేకలు వేశారు.


ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,


ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు. యెహోవా సమూయేలు ద్వారా వాగ్దానం చేసినట్టే వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.


యెహోవా చెప్పినట్లు, సౌలు రాజ్యాన్ని దావీదు వశం చేయడానికి హెబ్రోనులో అతని దగ్గరకు ఆయుధాలు ధరించి వచ్చిన యుద్ధవీరుల లెక్కలు ఇవే:


కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ