Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 18:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 వారు అబ్షాలోము మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలో లోతైన గోతిలో పడవేసి దానిలో పెద్ద రాళ్లకుప్ప పేర్చి, ఇశ్రాయేలీయులందరు తమ ఇళ్ళకు పారిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 జనులు అబ్షాలోముయొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమతమ యిండ్లకు పోయిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 యోవాబు మనుష్యులు అబ్షాలోము శవాన్నీ తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు. అబ్షాలోము అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు పారిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 వారు అబ్షాలోము మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలో లోతైన గోతిలో పడవేసి దానిలో పెద్ద రాళ్లకుప్ప పేర్చి, ఇశ్రాయేలీయులందరు తమ ఇళ్ళకు పారిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 18:17
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు.


కాబట్టి రాజు లేచి వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడని విన్న ప్రజలందరూ రాజును కలవడానికి వచ్చారు. ఇంతలో ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళకు పారిపోయారు.


అప్పుడు ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రజలందరు తమలో తాము వాదించుకుంటూ, “మనలను శత్రువుల చేతిలో నుండి విడిపించింది రాజు; మనలను ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడింది కూడా అతడే. కాని ఇప్పుడు అతడు అబ్షాలోము కారణంగా దేశం విడిచి పారిపోయాడు.


బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కుమారుడైన షేబ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు బూర ఊది, “దావీదుతో మనకు ఏ భాగం లేదు, యెష్షయి కుమారునిలో ఏ వాటా లేదు, ఇశ్రాయేలీయులారా! ప్రతిఒక్కరు మీ గుడారానికి వెళ్లండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.


ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.


ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు.


కాబట్టి యెహోరాము తన రథాలన్నిటితో జాయీరుకు వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు; అతని సైన్యం తమ గుడారాలకు పారిపోయారు.


నీతిమంతుల పేరు ఆశీర్వాదాలలో వాడబడుతుంది, కాని దుర్మార్గుల పేరు కుళ్ళిపోతుంది.


వారు పెద్దలతో, “ఈ మా కుమారుడు మొండివాడు, తిరుగుబాటు చేసేవాడు. వీడు మాకు లోబడడు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పాలి.


అప్పుడు అతని పట్టణంలోని పురుషులందరు వాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి. ఇశ్రాయేలీయులందరు దాని గురించి విని భయపడతారు.


సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆజ్ఞ ఇవ్వగా వారు వాటిని స్తంభాల నుండి దించి, వారు దాక్కున్న గుహలోకి విసిరి ఆ గుహ ముఖద్వారం దగ్గర వారు పెద్ద రాళ్లను ఉంచారు, అవి నేటికీ ఉన్నాయి.


ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు లోయ అని పిలుస్తారు.


అతడు హాయి రాజును సాయంకాలం వరకు స్తంభానికి వ్రేలాడదీశాడు. సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆ మృతదేహాన్ని స్తంభం నుండి క్రిందికి దించి పట్టణ ద్వారం దగ్గర పడవేయమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి దానిపై ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.


కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ