Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 15:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోముదగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహుబలమాయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 బలి అర్పించాలని గిలో గ్రామ నివాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకొన్న జన సమూహం మరీ ఎక్కువ కావడంవల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 15:12
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.


ఇంతలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరు యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు కూడా అతనితో ఉన్నాడు.


అబ్షాలోము ఇశ్రాయేలీయులందరు అది విని, “అర్కీయుడైన హూషై చెప్పిన సలహా అహీతోపెలు చెప్పిన దానికంటే బాగుంది” అన్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి ఆపద రప్పించడానికి అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు.


అహీతోపెలు తాను చెప్పిన సలహాను పాటించకపోవడం చూసి, తన గాడిదకు గంతకట్టి తన ఊరిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. తన ఇంటి విషయాలు చక్కబెట్టుకున్న తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అహీతోపెలు పాతిపెట్టబడ్డాడు.


మయకాతీయుడైన అహస్బయి కుమారుడు ఎలీఫెలెతు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఎలీయాము,


వారు ఉపవాసం ప్రకటించి నాబోతును ప్రజల ఎదుట ప్రముఖ స్థలంలో కూర్చోబెట్టారు.


ఆ ఉత్తర్వులలో ఆమె ఇలా వ్రాసింది: “ఉపవాస దినం ఒకటి ప్రకటించి నాబోతును ప్రజలమధ్య ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టండి.


అహీతోపెలు రాజు యొక్క సలహాదారుడు. అర్కీయుడైన హూషై రాజుకు సన్నిహితుడైన మిత్రుడు.


యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.


నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.


భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.


దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!


షేబ నుండి వచ్చే ధూపం గురించి గాని దూరదేశం నుండి వచ్చే మధురమైన సువాసనగల వస గురించి నేను ఏమి పట్టించుకోను? మీ దహనబలులు అంగీకరించదగినవి కావు; మీ బలులు నన్ను ప్రసన్నం చేయవు.”


బిలాము బాలాకుతో అన్నాడు, “నాకు ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టాలి, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్లను నా కోసం సిద్ధం చేయాలి.”


బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు.


బాలాకు బిలాము చెప్పినట్టు చేశాడు, ప్రతి బలిపీఠం మీద కోడెను, పొట్టేలును అర్పించాడు.


“నేను మీ అందరి గురించి చెప్పడం లేదు; మీలో నేను ఎంపిక చేసుకున్నవారెవరో నాకు తెలుసు. అయితే ‘నా ఆహారం తిన్నవాడే నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తుతాడు’ అనే లేఖనం నెరవేరడానికి అలా జరగాలి.


వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నప్పటికి, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.


గోషేను, హోలోను గిలోహు, మొత్తం పదకొండు పట్టణాలు వాటి గ్రామాలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ