Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 12:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నీవు నన్ను లక్ష్యముచేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 12:10
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే ఆ రాత్రి కలలో దేవుడు అబీమెలెకుకు కనిపించి, “నీవు తీసుకున్న స్త్రీ కారణంగా నీవు చచ్చినట్టే ఎందుకంటే ఆమె ఇంకొకని భార్య” అని చెప్పారు.


అప్పుడు రాజు చాలా కలత చెంది గుమ్మానికి పైన ఉన్న గది లోనికి వెళ్లి, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా” అని అంటూ ఏడ్చాడు.


ఎందుకంటే దావీదు తాను బ్రతికిన కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేస్తూ, ఆయన ఆజ్ఞలలో దేనికి అవిధేయుడు కాలేదు. హిత్తీయుడైన ఊరియా విషయంలో మాత్రం అతడు తప్పిపోయాడు.


మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు.


“ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”


ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ”


యేసు వానితో, “నీ కత్తిని దాని ఒరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు.


“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.


దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని తెలియక ఆయన దయ, సహనం, ఓర్పు అనే ఐశ్వర్యాన్ని త్రోసివేస్తారా?


కాబట్టి ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు.


“కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ