Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 8:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 హజాయేలు–నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 అప్పుడు హజాయేలు “నా ప్రభూ, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. దానికి ఎలీషా “ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నీవు చేయబోయే దుర్మార్గపు పనులు నాకు తెలుసు. వాళ్ళ ప్రాకారాలను నీవు తగలబెడతావు. వాళ్ళల్లో యువకులను కత్తితో హతమారుస్తావు. పిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు. గర్భవతుల కడుపులు చీరేస్తావు” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 “అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 8:12
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా ప్రభువా, యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు నేను ఏమి చేశానో మీరు వినలేదా? యెహోవా ప్రవక్తల్లో వందమందిని రెండు గుహల్లో దాచాను, ఒక్కొక్క గుహలో యాభైమంది లెక్కన ఉంచి వారికి భోజనం పెట్టి పోషించాను.


హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు.


ఆ సమయంలో అరాము రాజైన హజాయేలు వెళ్లి గాతుపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత యెరూషలేము మీద దాడి చేయాలనుకున్నాడు.


అయితే యూదా రాజైన యెహోయాషు తన పూర్వికులు, యూదా రాజులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరంలో, అలాగే రాజభవనంలో ఉన్న ఖజానాలోని బంగారమంతా అరాము రాజైన హజాయేలుకు పంపాడు. కాబట్టి హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.


యెహోయాహాజు పరిపాలన అంతటిలో, అరాము రాజైన హజాయేలు ఇశ్రాయేలు ప్రజలను బాధించాడు.


కాబట్టి యెహోవాకు ఇశ్రాయేలు మీద కోపం రగులుకుంది, చాలాసార్లు ఆయన వారిని అరాము రాజైన హజాయేలు, అతని కుమారుడు బెన్-హదదు చేతులకు అప్పగించారు.


యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.


ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.


ఆమె, “నా ప్రభువా, మిమ్మల్ని కుమారుడు కావాలని అడిగానా? నాతో అబద్ధం చెప్పకండి అని నేను అనలేదా?” అని అన్నది.


వారి కళ్లముందే వారి పసిపిల్లలు ముక్కలుగా నలుగ కొట్టబడతారు; వారి ఇల్లు దోచుకోబడతాయి వారి భార్యలు అత్యాచారం చేయబడతారు.


వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి; పసిపిల్లలపై వారు జాలిపడరు. పిల్లలపై వారు దయ చూపరు.


కాబట్టి మీ ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది, షల్మాను యుద్ధంలో బేత్-అర్బేలును పాడుచేసినట్లు, మీ కోటలన్నీ నాశనమవుతాయి, ఆ రోజు తల్లులు తమ పిల్లలతో పాటు నేలకు కొట్టబడతారు.


సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”


ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!


యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.


అయినప్పటికీ ఆమెను బందీగా తీసుకెళ్లారు. ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని ముక్కలు చేశారు. దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ