Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 7:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 దైవజనుడు రాజుతో, “రేపు ఇదే సమయానికి సమరయ పట్టణ ద్వారం దగ్గర ఒక షెకెల్ వెండికి మానిక సన్నని గోధుమ పిండి, ఒక షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్ముతారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 మరియు–రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 “రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్ముడవుతాయి” అని దేవుని మనిషి రాజుతో చెప్పినట్టు ఇది జరిగింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 ఎలీషా కూడ ఇలా సూచించాడు: “ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్కరూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను. సమారియ నగర ద్వారముల వద్ద గల అంగడి వీధివద్ద ప్రతివారు కొనగలరు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 దైవజనుడు రాజుతో, “రేపు ఇదే సమయానికి సమరయ పట్టణ ద్వారం దగ్గర ఒక షెకెల్ వెండికి మానిక సన్నని గోధుమ పిండి, ఒక షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్ముతారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 7:18
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు.


అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అతనితో పెద్దలు కూర్చుని ఉన్నారు. రాజు ఒక దూతను పంపాడు, కాని అతడు ఎలీషాను చేరకముందే, ఎలీషా ఆ పెద్దలతో, “ఆ హంతకుడు నా తల నరకమని మనిషిని పంపిస్తున్నాడని మీరు చూడట్లేదా? చూడండి, ఆ దూత రాగానే తలుపు మూసి అతన్ని లోపలికి రానివ్వకండి. అతని వెంట అతని యజమాని పాదాల శబ్దం వస్తుంది కదా” అని చెప్పాడు.


అంతకుముందు, ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా, ఇది జరుగుతుందా?” అని అన్నాడు. దైవజనుడు జవాబిస్తూ, “నీవు నీ కళ్లారా చూస్తావు కాని దానిలో ఏమి తినవు” అన్నాడు.


నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ