Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 5:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి–గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు–నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి “గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?” అని అడిగాడు. దానికి గేహాజీ “నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 5:25
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది.


అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు.


తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.


గేహజీ, “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపి, ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చారు. దయచేసి వారికి ఒక తలాంతు వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.


ధూపం వేయడానికి చేతిలో ధూపం పెట్టుకున్న ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు యెహోవా మందిరంలో ధూపవేదిక ముందు యాజకుల సమక్షంలో వారి మీద విరుచుకుపడుతుండగా, అతని నుదుటిపై కుష్ఠురోగం వచ్చింది.


“వేశ్య యొక్క పనియు అట్టిదే; అది తిని నోరు తుడుచుకుని నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.


నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.


వారు భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు.


వారు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు.


సౌలు చిన్నాన్న అతన్ని అతని సేవకుడిని చూసి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు. అందుకతడు, “గాడిదలను వెదకడానికి వెళ్లాం, అవి కనబడలేదని సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్లాం” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ