Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 4:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది. అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో చెప్పింది. కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ పూర్తి అయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది. అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 4:6
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు.


దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.


ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది.


వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేదు.


వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.


వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు.


అప్పుడు ఆయన వారి కళ్లను ముట్టి, “మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక” అన్నారు.


ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.


వారందరూ సరిపడినంత తిన్న తర్వాత ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు.


వారు భూమి నుండి ఈ ఆహారాన్ని తిన్న మరుసటిరోజు మన్నా ఆగిపోయింది; ఇశ్రాయేలీయులకు ఇకపై మన్నా లేదు, కానీ ఆ సంవత్సరం వారు కనాను పంటను తిన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ