2 రాజులు 4:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి –పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 ఎలీషా తిరిగి గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు ఆ దేశంలో కరువు నెలకుని ఉంది. ప్రవక్తల సమాజం వారు అతని ముందు కూర్చుని ఉన్నారు. అప్పుడు అతడు “పొయ్యి మీద పెద్ద వంట పాత్ర పెట్టి వీళ్ళకు ఆహరం సిద్ధం చెయ్యి” అని తన సేవకుడికి ఆదేశించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్38 ఎలీషా మరల గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడా ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకునితో, “పెద్ద కుండను నిప్పుమీద ఉంచుము. ప్రవక్తల బృందానికి కూర తయారు చేయి” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |