Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 4:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 ఆమెను కలుసుకోడానికి పరిగెత్తి వెళ్లి, ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా! మీ బాలుడు క్షేమమా?’ అని అడుగు” అన్నాడు. ఆమె, “అంతా క్షేమమే” అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి–నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామె– సుఖముగా ఉన్నామని చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ‘నువ్వూ, నీ భర్తా, నీ కొడుకూ క్షేమంగా ఉన్నారా?’ అని అడుగు” అని చెప్పి పంపించాడు. దానికామె “క్షేమంగానే ఉన్నాం” అని జవాబిచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసుకునేందుకు, ‘ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త సరిగా వున్నడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను కలుసుకొని అడుగుము.’” గేహజీ ఆ విధంగా ఆ షూనేము స్త్రీని అడిగాడు. ఆమె, “అంతా క్షేమము” అని చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 ఆమెను కలుసుకోడానికి పరిగెత్తి వెళ్లి, ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా! మీ బాలుడు క్షేమమా?’ అని అడుగు” అన్నాడు. ఆమె, “అంతా క్షేమమే” అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 4:26
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యాకోబు, “లాబాను క్షేమమేనా?” అని అడిగాడు. “అవును, అతడు క్షేమమే, అదిగో, అతని కుమార్తె రాహేలు గొర్రెల మందతో వస్తుంది” అని వారు చెప్పారు.


కాబట్టి యాకోబు, “వెళ్లు, నీ అన్నలు, అలాగే మందల యోగక్షేమాలు తెలుసుకుని, వచ్చి నాకు చెప్పు” అని యోసేపుతో అన్నాడు. తర్వాత అతడు హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు. యోసేపు షెకెముకు చేరుకున్నప్పుడు,


వారు ఎలా ఉన్నారని వారిని అడిగి, “వృద్ధుడైన మీ తండ్రి గురించి మీరు నాకు చెప్పారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బ్రతికే ఉన్నారా?” అని అన్నాడు.


అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.


అందుకతడు, “అతని దగ్గరకు ఈ రోజు ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు సబ్బాతు దినం కాదు కదా” అన్నాడు. అందుకామె, “అంతా సమాధానంగానే ఉంటుంది” అన్నది.


కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!


ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.


గేహజీ, “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపి, ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చారు. దయచేసి వారికి ఒక తలాంతు వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.


ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.


అప్పుడు మోషే అప్పుడు అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్పారు: “ ‘నన్ను సమీపించేవారి ద్వారా నేను నా పరిశుద్ధతను కనుపరచుకుంటాను; ప్రజలందరి దృష్టిలో నేను ఘనపరచబడతాను.’ ” అహరోను మౌనంగా ఉండిపోయాడు.


అతనితో ఇలా అన్నాడు: “నీవు ఆ యువకుని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి ఇలా చెప్పు, ‘యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారంగా ఉన్నందుకు, అది గోడలులేని పట్టణంలా ఉంటుంది.


కొంతకాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగివెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుందాం” అని బర్నబాతో అన్నాడు.


అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా.


కాబట్టి సమూయేలు ఏ విషయం దాచిపెట్టకుండా అంతా అతనితో చెప్పాడు. అది విని ఏలీ, “అది చెప్పింది యెహోవాయే; ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయన అదే చేస్తారు” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ