Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 22:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 తర్వాత కార్యదర్శియైన షాఫాను రాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: “మీ సేవకులు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 రాజునొద్దకు తిరిగి వచ్చి–మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పనివిషయములో అధికారులై పని జరిగించువారిచేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 రాజు దగ్గరికి తిరిగి వచ్చి “మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు” అని వార్త చెప్పి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 తర్వాత కార్యదర్శియైన షాఫాను రాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: “మీ సేవకులు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 22:9
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు రాజును పిలిపించారు; హిల్కీయా కుమారుడు, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు రాజ్య లేఖికుడైన యోవాహు వారి దగ్గరకు వెళ్లారు.


అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు” అని రాజుకు చెప్పి రాజు సముఖంలో దాని నుండి చదివాడు.


తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:


అతని పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో రాజైన యోషీయా మెషుల్లాము మనుమడును అజల్యా కుమారుడును, కార్యదర్శియునైన షాఫానును యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి పంపాడు. అతడు ఇలా చెప్పాడు:


ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని చెప్పి దానిని షాఫానుకు ఇచ్చాడు.


బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు.


ఇంకా, షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు అండగా నిలబడ్డాడు, కాబట్టి యిర్మీయాను చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.


యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:


మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.


బబులోను రాజు యూదాలో కొందరిని విడిచిపెట్టి షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడునైన గెదల్యాను వారి మీద అధిపతిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము ఇతర దేశాల్లో ఉన్న యూదులందరు విన్నప్పుడు,


నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు.


డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ