Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 21:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 తన తండ్రి హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను మనష్షే మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. ఇశ్రాయేలు రాజు అహాబువలె, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. మనష్షే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 21:3
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.


కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు. తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు.


అయితే వారు ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన యరొబాము కుటుంబీకులు చేసిన పాపాలను చేస్తూనే ఉన్నారు. అంతేకాక, అషేరా స్తంభం అలాగే సమరయలో నిలిచి ఉంది.


తమ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి, తమ కోసం పోతపోసిన రెండు దూడలను, అషేరా స్తంభాన్ని చేసుకున్నారు. వారు నక్షత్రాలకు నమస్కరించి బయలును సేవించారు.


అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?


అతడు క్షేత్రాలను తొలగించి, పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు, ఎందుకంటే ఆ కాలం వరకు ఇశ్రాయేలీయులు దానికి ధూపం వేసేవారు. (అది నెహుష్టాను అని పిలువబడేది.)


అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.


అహజ్యా అహాబు ఇంటి అల్లుడు కాబట్టి అతడు అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించి అహాబు కుటుంబంలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.


హిజ్కియా స్వయంగా ఈ దేవుని ఉన్నత స్థలాలను బలిపీఠాలను తొలగించి, యూదా వారితో యెరూషలేము వారితో, ‘మీరు ఒక్క బలిపీఠం దగ్గర ఆరాధించి దానిపై బలులు అర్పించాలి’ అని చెప్పలేదా?


అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు.


నేను సూర్యుడిని దాని ప్రకాశంలో చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,


“అయితే యెహోవాను విడిచి, నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి, గాదు దేవునికి బల్లను సిద్ధపరచి, మెనీ దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా,


“ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు.


మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు; వారి సంప్రదాయాలను అనుసరించారు; కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు; మీరు నా ప్రజల నిందను భరిస్తారు.”


మీ దేవుడైన యెహోవాకు మీరు నిర్మించే బలిపీఠం ప్రక్కన ఏ అషేరా స్తంభాన్ని ఏర్పాటు చేయకూడదు,


ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ,


నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,


లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.


మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ