Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 19:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా –అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 19:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అష్షూరు రాజు తన ప్రధాన సైన్యాధిపతిని, ముఖ్య అధికారిని, సైన్యాధిపతిని, పెద్ద సైన్యంతో, లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా దగ్గరకు పంపాడు. వారు యెరూషలేముకు దండెత్తి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగారు.


హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి.


ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?”


నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!


రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు,


అందుకు ప్రవక్త, “భయపడకు, మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది” అన్నాడు.


అప్పుడు యహాజీయేలు ఇలా ప్రకటించాడు: “యెహోషాపాతు రాజా, యూదా యెరూషలేము నివాసులారా మీరందరు వినండి! యెహోవా మీతో చెప్పే మాట ఇదే: ‘ఈ మహా సైన్యాన్ని చూసి భయపడకండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే యుద్ధం మీది కాదు, దేవునిది.


అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడనవసరం ఉండదు. మీరు మీ స్థలాల్లో నిలబడి ఉండండి; యెహోవా మీకిచ్చే విడుదలను మీరు నిలబడి చూడండి. యూదా, యెరూషలేమా, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. యెహోవా మీతో ఉంటారు.’ ”


దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి.


మీ విరోధుల గొడవను, నిరంతరం పెరిగే మీ శత్రువుల గందరగోళాన్ని విస్మరించవద్దు.


అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు.


కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, ఈజిప్టులో చేసినట్టు కర్రతో మిమ్మల్ని కొట్టి మీమీద తన దుడ్డుకర్ర ఎత్తిన అష్షూరీయులకు భయపడకండి.


“సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి వారి దూషణకు దిగులుపడకండి.


అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు:


నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి “భయపడకు” అన్నారు.


మీలో అయిదుగురు వందమందిని, వందమంది పదివేలమందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.


మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు.


యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు, ఎందుకంటే రేపు ఈ సమయానికి నేను వారందరినీ చంపి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తాను. మీరు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేయాలి” అని చెప్పారు.


ఆ మృగం దేవుని దూషించడానికి, దేవుని నామాన్ని, ఆయన నివాస స్థలాన్ని, దేవునితో జీవించే పరలోక నివాసులను దూషించడానికి నోరు తెరిచింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ