Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 18:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం, రొట్టె, ద్రాక్షతోటలు ఉన్న దేశము. ఒలీవచెట్లు, తేనె ఉన్న దేశము. మరణాన్ని కాదు, జీవాన్ని ఎంచుకోండి. “హిజ్కియా, ‘యెహోవా మనలను విడిపిస్తారు’ అంటూ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, అతని మాటలు వినకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున–యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 నేను వచ్చి మిమ్మును దూరంగా మీ సొంత ప్రదేశము వలె ఒక పచ్చిక ప్రదేశానికి తీసుకు వెళ్లేంత వరకు మీరిది చేయవచ్చు. అది ధాన్యం గల ప్రదేశము. క్రొత్త ద్రాక్షారసం గలది. ద్రాక్షా పొలాలు, రొట్టె గలది. ఒలీవ తేనెగల ప్రదేశమది. అప్పుడు మీరు బ్రతకవచ్చు, చనిపోరు. కాని హిజ్కియా మాటలు వినకండి. అతను మీ బుద్ధి మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. యెహోవా మనలను కాపాడ్తాడు. అని అతను చెప్పుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం, రొట్టె, ద్రాక్షతోటలు ఉన్న దేశము. ఒలీవచెట్లు, తేనె ఉన్న దేశము. మరణాన్ని కాదు, జీవాన్ని ఎంచుకోండి. “హిజ్కియా, ‘యెహోవా మనలను విడిపిస్తారు’ అంటూ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, అతని మాటలు వినకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 18:32
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ద్రాక్షచెట్టుకు తన గాడిదను, మంచి ద్రాక్షచెట్టుకు గాడిద పిల్లను కడతాడు; అతడు ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుకుతాడు.


చివరికి యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా హెచ్చరించినట్లు, వారిని తన సముఖం నుండి త్రోసివేశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశం నుండి బందీలుగా అష్షూరుకు వెళ్లారు, ఈనాటికీ వారక్కడ ఉన్నారు.


హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.


అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.


“యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు.


రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన సామాన్య ప్రజలతో పాటు బందీలుగా తీసుకెళ్లాడు.


కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.


ఒకప్పుడు జనసమూహంతో కలిసి పెద్ద ఊరేగింపుగా, ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.


కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను.


తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం.


యెహోవా మనయందు ఆనందిస్తే, ఆ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపిస్తారు, దానిని మనకు ఇస్తారు.


అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ