Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 18:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అతడు తన పూర్వికుడైన దావీదు ఆదర్శాన్ని అనుసరించి, యెహోవా దృష్టిలో ఏది సరైనదో అది చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 హిజ్కియా తన పూర్వికుడైన దావీదువలె, యెహోవా దృష్టికి మంచి పనులు చేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 18:3
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను.


సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు.


ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.


ఎందుకంటే దావీదు తాను బ్రతికిన కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేస్తూ, ఆయన ఆజ్ఞలలో దేనికి అవిధేయుడు కాలేదు. హిత్తీయుడైన ఊరియా విషయంలో మాత్రం అతడు తప్పిపోయాడు.


నీ తండ్రియైన దావీదులా నీవు నా మార్గాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను.”


అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.


అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు.


“యెహోవా, నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.


అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.


అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.


వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.


నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము.


ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.


“యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.


కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి.


పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది.


ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,


మీకు మేలు కలిగేలా యెహోవా చెప్పినట్లు మీ శత్రువులందరిని మీ ఎదుట నుండి తరిమివేసి యెహోవా మీ పూర్వికులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ