Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 17:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 వారు మొదట అక్కడ నివసించినప్పుడు, వారు యెహోవాకు భయపడలేదు; కాబట్టి ఆయన వారి మధ్యకు సింహాలను పంపించారు, అవి వారిలో కొంతమందిని చంపాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యెహోవావారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేని వారు గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్ళల్లో కొంతమందిని చంపాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 ఈ ప్రజలు షోమ్రోనులో ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించలేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపించాడు. ఈ సింహాలు కొందరిని చంపివేశాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 వారు మొదట అక్కడ నివసించినప్పుడు, వారు యెహోవాకు భయపడలేదు; కాబట్టి ఆయన వారి మధ్యకు సింహాలను పంపించారు, అవి వారిలో కొంతమందిని చంపాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 17:25
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు తన దారిన వెళ్తున్నప్పుడు ఒక సింహం ఎదురై అతన్ని చంపేసింది. అతని శవం త్రోవలోనే పడి ఉంది. దాని ప్రక్కన గాడిద సింహం నిలబడి ఉన్నాయి.


కాబట్టి ప్రవక్త అన్నాడు, “నీవు యెహోవాకు లోబడలేదు కాబట్టి నన్ను విడిచి వెళ్లిన వెంటనే సింహం నిన్ను చంపుతుంది.” ఆ మనిషి వెళ్లిన తర్వాత ఒక సింహం అతనిపై దాడి చేసి అతన్ని చంపింది.


అష్షూరు రాజుకు, “మీరు తీసుకువచ్చి సమరయ పట్టణాల్లో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని నియమాలు తెలియవు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలియదు కాబట్టి సింహాలు వారిని చంపుతూ ఉన్నాయని వారు అష్షూరు రాజుకు చెప్పారు.”


కాబట్టి సమరయ నుండి బందీలుగా వెళ్లిన యాజకులలో ఒకడు బేతేలులో నివసించడానికి వచ్చి, యెహోవాను భయభక్తులతో ఎలా ఆరాధించాలో వారికి బోధించాడు.


వారు యెహోవాను ఆరాధించారు కాని ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాల్లో అన్ని రకాల ప్రజలను యాజకులుగా చేసుకున్నారు.


వారు ఈనాటి వరకు తమ పూర్వాచారాలను పాటిస్తున్నారు. యెహోవా ఇశ్రాయేలు అని పేరుపెట్టబడిన యాకోబు సంతానం ఆయనను ఆరాధించలేదు, ఆయన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను అనుసరించలేదు.


ఈ ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్ననూ, విగ్రహాలను కూడా సేవించారు. ఈనాటికీ వారి పిల్లలు, పిల్లల పిల్లలు వారి పూర్వికులు చేసినట్టే చేస్తున్నారు.


అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా పేరిట వారిని శపించాడు. అప్పుడు రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై రెండు మందిని ముక్కలు ముక్కలుగా చీల్చాయి.


దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను. మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.


దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు.


“నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ.


“ఆ దేశం పిల్లలు లేనిదై నిర్మానుష్యంగా మారేలా దాని మీదికి అడవి మృగాలను పంపుతాను. వాటి కారణంగా దానిగుండా ఎవరూ ప్రయాణించరు.


“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది!


“నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను. “ఆయన జీవంగల దేవుడు. ఆయన ఎల్లకాలం జీవిస్తారు; ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.


మీకు విరుద్ధంగా అడవి జంతువులు పంపుతాను, అవి మీ నుండి మీ పిల్లలను దోచుకుంటాయి, మీ పశువులను నాశనం చేస్తాయి, మీ మార్గాలన్నీ నిర్మానుష్యమయేలా మీ సంఖ్య తగ్గేలా చేస్తాయి.


అందుకతడు, “నేను హెబ్రీయున్ని; సముద్రాన్ని ఎండిన నేలను సృజించిన పరలోక దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను” అన్నాడు.


రూబేనీయులారా, గాదీయులారా, యెహోవా మాకు మీకు మధ్య యొర్దానును సరిహద్దుగా చేశారు! యెహోవాలో మీకు వాటా లేదు’ అని అంటారేమో! మీ సంతతివారు మా సంతతివారిని యెహోవాకు భయపడకుండా చేస్తారేమో!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ