Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 10:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 యెహోవా యెహుతో, “నా మనస్సులో ఉన్నదంతా అహాబు వంశానికి చేసి నీవు నా దృష్టిలో సరియైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు” అన్నారు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను–నీవు నా హృదయాలోచనయంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలురాజ్యసింహాసనముమీద ఆసీనులగుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 కాబట్టి యెహోవా యెహూతో “అహాబు కుటుంబం విషయంలో నీవు నా హృదయంలో ఉన్నదే చేసి నా దృష్టికి న్యాయమైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకూ ఇశ్రాయేలును పరిపాలిస్తారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 యెహోవా యెహుతో, “నా మనస్సులో ఉన్నదంతా అహాబు వంశానికి చేసి నీవు నా దృష్టిలో సరియైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు” అన్నారు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 10:30
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రవక్త రాజుతో అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘చంపబడాలని నేను నిశ్చయించిన మనిషిని నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి అతని ప్రాణానికి నీ ప్రాణం, అతని ప్రజలకు బదులు నీ ప్రజలను అర్పిస్తావు.’ ”


నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు.


“అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.”


యెహు చనిపోయి తన పూర్వికులను చేరాడు, సమరయలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు.


యూదారాజు అహజ్యా కుమారుడైన యోవాషు పరిపాలనలోని ఇరవై మూడవ సంవత్సరంలో యెహు కుమారుడు యెహోయాహాజు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు.


యూదా రాజైన యోవాషు పరిపాలనలోని ముప్పై ఏడవ సంవత్సరంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.


యోవాషు కుమారుడు యూదా రాజైన అమజ్యా పరిపాలనలోని పదిహేనవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యరొబాము సమరయలో రాజయ్యాడు, అతడు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు.


యరొబాము తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులతో పాటు నిద్రించాడు, అతని తర్వాత అతని కుమారుడైన జెకర్యా రాజయ్యాడు.


అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను.


నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ