Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 థెస్సలొనీకయులకు 3:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

10 మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కొరకు ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 థెస్సలొనీకయులకు 3:10
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది.


మన పన్నెండు గోత్రాల ఇశ్రాయేలీయులు పగలు రాత్రి దేవుని సేవించడం ద్వారా ఆ వాగ్దాన నెరవేర్పును చూస్తామనే నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే అగ్రిప్ప రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నన్ను నిందిస్తున్నారు.


దీన్ని గురించి నాకు చాలా నమ్మకం ఉన్నందువల్ల, మీకు రెట్టింపు ఆనందం కలిగేలా నేను మొదట మిమ్మల్ని చూడడానికి రావాలని అనుకున్నాను.


అందుకే మీరు విశ్వాసం వల్ల దృఢంగా నిలిచి ఉన్నారు. కాబట్టి మీ విశ్వాస విషయమై మేము ఆజ్ఞాపించడంలేదు. పైగా మేము మీ సంతోషం కోసం మీ తోటిపనివారిగా పనిచేస్తున్నాము.


చివరిగా సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. సమాధానం కలిగి జీవించండి. ప్రేమ సమాధానాలకు కర్తయైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.


మేము బలహీనంగా ఉన్నా మీరు బలంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థిస్తున్నాము.


మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు.


మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము.


క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కోసం తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు.


మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మేము త్వరగా మీ దగ్గరకు రావడానికి మార్గం సరాళం చేయును గాక!


దీన్ని హృదయంలో ఉంచుకుని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తిచేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము.


నా పితరులు సేవించినట్లే, స్వచ్ఛమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాత్రింబవళ్ళు మానక నిన్ను నా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటున్నాను.


మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి.


ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి: “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు, రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ”


అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.


నాకైతే, నేను మీ కోసం ప్రార్ధన చేయడంలో విఫలమవ్వడం వలన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాడనవుతాను. అది నాకు దూరమవ్వాలి. మంచిదైన సరియైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ