1 సమూయేలు 4:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇశ్రాయేలీయులు ఎబెనెజెరులో, ఫిలిష్తీయులు ఆఫెకులో శిబిరం ఏర్పరచుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 సమూయేలును గురించిన వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించింది. ఏలీ పండుముసలి వాడయ్యాడు. ఏలీ కుమారులు యెహోవా ఎదుట దుష్ట కార్యాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఫిలిష్తీయులంతా ఏకమై ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ దాడిని ఎదుర్కోవటానికి కదలి వెళ్లి ఎబెనెజరు అనే చోట కాచుకొని యుండిరి. ఆఫెకు అనే చోట ఫిలిష్తీయులు బసచేశారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇశ్రాయేలీయులు ఎబెనెజెరులో, ఫిలిష్తీయులు ఆఫెకులో శిబిరం ఏర్పరచుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారం, నేడు మిమ్మల్ని తనకు ప్రజలుగా నియమించుకొని తానే మీకు దేవుడైయుండేలా మీ దేవుడైన యెహోవా నేడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణంలోను మీరు ఈ రోజున మీరంతా అనగా మీ నాయకులు, ముఖ్య పురుషులు, మీ పెద్దలు, అధికారులు, ఇశ్రాయేలీయులలో ఇతర పురుషులందరు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ పాళెంలో నివసిస్తున్న విదేశీయులు, మీ కట్టెలను నరికేవారు, మీ నీటిని తోడేవారు, అందరు నేడు మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడికలోకి ప్రవేశించడానికి ఇక్కడ నిలబడి ఉన్నారు, ఈ రోజు యెహోవా ప్రమాణం చేయడం ద్వారా, ఈ రోజు మిమ్మల్ని తన ప్రజలుగా నియమించుకొని, ఆయన మీకు వాగ్దానం చేసినట్లుగా మీ తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసినట్లుగా మీ దేవునిగా ఉంటారు.