1 సమూయేలు 26:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకున్నాడు, అప్పుడు వారిద్దరు వెళ్లిపోయారు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి వారందరు నిద్రలో ఉన్నారు. ఎవరూ వచ్చిన వారిని చూడలేదు, జరిగింది వారికి తెలియదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారికందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పెట్టినవాడొకడును లేడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకు ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడు ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు. ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకున్నాడు, అప్పుడు వారిద్దరు వెళ్లిపోయారు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి వారందరు నిద్రలో ఉన్నారు. ఎవరూ వచ్చిన వారిని చూడలేదు, జరిగింది వారికి తెలియదు. အခန်းကိုကြည့်ပါ။ |