Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 24:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తారు. నీవు నా పట్ల చేసినవాటికి యెహోవాయే ప్రతీకారం చేస్తారు కాని నా చేయి నిన్ను తాకదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తారు. నీవు నా పట్ల చేసినవాటికి యెహోవాయే ప్రతీకారం చేస్తారు కాని నా చేయి నిన్ను తాకదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 24:12
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.


అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు.


నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే.


అప్పుడు ముప్పైమందికి నాయకుడైన అమాశై మీదికి ఆత్మ రాగా అతడు అన్నాడు: “దావీదూ, మేము నీ వారము! యెష్షయి కుమారుడా! మేము నీతో ఉన్నాము. నీకు సమాధానం, సమాధానం, నీ సహాయకులకు సమాధానం కలుగును, నీ దేవుడే నీకు సహాయం చేస్తారు.” కాబట్టి దావీదు వారిని చేర్చుకొని తన బలగాలకు నాయకులుగా నియమించాడు.


“ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.


యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి.


నా దేవా, నాకు న్యాయం తీర్చండి, భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా నా పక్షంగా వాదించి, మోసగాళ్ల నుండి దుష్టుల నుండి నన్ను విడిపించండి.


యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ప్రతీకారం సాధించే దేవా, ప్రకాశించండి.


నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి.


తాను దూషించబడినా తిరిగి దూషించలేదు. తాను హింసించబడుతున్నా ఎవరిని బెదిరించలేదు. కాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నారు.


వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు.


నేను నీ పట్ల తప్పు చెయ్యలేదు, నీవే నా మీదికి యుద్ధానికి వస్తూ నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతియైన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చును గాక.”


తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.


యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.


యెహోవా ప్రతిఒక్కరికి వారి నీతికి నమ్మకత్వానికి బహుమానం ఇస్తారు. యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించారు కాని, యెహోవా అభిషేకించిన వాని మీద నేను చేయి వేయను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ